రెండు బైకులు ఢీ…ఒకరికి తీవ్ర గాయాలు
ప్రకాశం ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గోళ్లవిడిపి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్నాయి..ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108లో యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించినట్లు సమాచారం. తీవ్రగాయాలైన వ్యక్తి గోళ్లవీడిపి చెందిన పెద్దన్నగా గుర్తించారు.
Tags: Two bikes collided…one seriously injured

