గడ్డేన్న వాగులో రెండు మృత దేహాలు లభ్యం
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా బైంసా పట్టణ సమీపంలోని గడ్డేన్నవాగు ప్రాజెక్టులో శనివారం వేకువజామున రెండు గుర్తుతెలియని మృతదేహాలు ఒడ్డుకి కొట్టుకురావడం కలకలం రేపింది… అవి చూసిన స్థానిక ప్రజలు బైంసా పోలీసులకు సమాచారం ఇచ్చారు .స్థానికుల సమాచారం ప్రకారం పట్టణంలోని ఓ వాడకి చెందిన పురుష మృతదేహం అని , ఇంకో మృత దేహం మహిళది అని చెబుతున్నారు . ఇద్దరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది . పోలీసులు మృతదేహాలను బయటకు తీసే పనిలో వున్నారు .ఈ ఘటన పై పోలీసులు కేసు నమోద్ చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Two bodies were found in Gaddenna Wagu