రెండు బస్సులు ఢీ
మచిలీపట్నం ముచ్చట్లు:
మచిలీపట్నం విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులు గాయాలతో బయటపడ్గారు. గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మచిలీపట్నం రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఇంద్ర హైటెక్ బస్సు బెంగళూరు నుంచి మచిలీపట్నం వస్తుండగా గూడూరు దగ్గర ప్రైవేట్ వాహనం మార్నింగ్ స్టార్ బస్సు వెనుక నుండి ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు పూర్తిగా ధ్వంసం అయింది. బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలు కావడంతో హడావుడిన ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించిన స్థానికులు.
Tags: Two buses collided

