ఇద్దరు పిల్లలు, తల్లి అదృశ్యం

Date:30/10/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

పుట్టింటికి వెళ్తున్నాని ఇంటి నుండి ఇద్దరు పిల్లలతో బయలుదేరిన వివాహిత అదృశ్యమైన సంఘటన కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజీవ్ గాంధీ నగర్ లో నివసించే పరమేష్, తన భార్య మానస మరియు ఇద్దరు పిల్లలు తేజ(9), యాస్విక(8) లతో కలిసి నివసిస్తున్నారు. పరమేష్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తుండగా, మానస ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. కాగా 28వ తేదీన  పరమేష్ ఉద్యోగానికి వెళ్ళగా, మానస అతనికి ఫోన్ చేసి పిల్లలను తీసుకొని తల్లి వద్దకు వెళ్తున్నాను అని తెలిపింది. అలా పిల్లలతో బయలుదేరిన మానస అటు తల్లి వద్దకు చేరకపోవటం, ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యటంతో ఆందోళన చెందిన ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మానస, పిల్లల కోసం గాలిస్తున్నారు.

ఫార్మా కంపెనీల వ్యర్ధ రసాయనాలతో పెద్ద సంఖ్యలో చేపల మృతి

Tags: Two children, mother disappears

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *