రెండు  రోజులు సంతాప దినాలు

విజయవాడ ముచ్చట్లు:
 
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలను పాటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బుధవారం నాడు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.అటు మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సోమవారం ఉదయం గౌతమ్ రెడ్డి తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారని తెలిపారు. ఉదయం 7.45 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని… కార్డియాక్ అరెస్టు రావడం వల్ల ఊపిరి తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. 90 నిమిషాల పాటు CPR చేశామని… అడ్వాన్స్‌డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్‌పై ఉంచామని.. అయినా ఆయన ప్రాణాలు దక్కలేదని ప్రకటించారు. సోమవారం ఉదయం 9:16 గంటలకు గౌతమ్‌రెడ్డి మరణించారని వారు తెలిపారు.
బుధవారం అంత్యక్రియలు మంగళవాం ఉదయం ఎయిర్‌ అంబులెన్స్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. నెల్లూరులో ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నారు.
 
ఇక, బుధవారం ఉదయం నెల్లూరు నుంచి బ్రాహ్మణపల్లికి అంతిమయాత్ర సాగనుండగా.. మధ్యాహ్నం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు.. ఉదయం స్వగ్రామంలో అంతిమ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు మేకపాటి గౌతమ్‌రెడ్డి అని గుర్తుచేశారు.. సీఎం జగన్‌తో అత్యంత సన్నిహితుడుగా ఉన్నారని.. ఈరోజు అయన లేరు అని విషయాన్ని నమ్మలేకపోతున్నాం అన్నారు. స్వగ్రామంలో అంతిమ కార్యక్రమాలు జరుగుతాయని.. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం ఇస్తామని తెలిపిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
 
Tags: Two days of mourning

Leave A Reply

Your email address will not be published.