Natyam ad

కూలిపోయిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు

అలస్కా ముచ్చట్లు:


అమెరికా దేశంలోని అలస్కా నగరంలో యూఎస్ మిలటరీకి చెందిన రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి. మిలటరీ శిక్షణలోభాగంగా ఇద్దరు సైనికులతో ప్రయాణిస్తున్న రెండు ఆర్మీ హెలికాప్టర్లు ఒక్క సారిగా కుప్పకూలిపోయాయిశిక్షణ విమానాలు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన యూఎస్ ఆర్మీ హెలికాప్టర్లలో ఇద్దరు చొప్పున ఉన్నారు. ఈ ఏడాది అలస్కారాష్ట్రంలో రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదానికి గురవడం రెండోసారి.ఆర్మీ హెలికాప్టర్ల ప్రమాదం గురించి ఎలాంటి సమాచారం అందలేదని యూఎస్ ఆర్మీ అలస్కా ప్రతినిధి జాన్ పెన్నెల్ చెప్పారు. హెలికాప్టర్ల ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నామని, సమాచారం అందిన తర్వాత మరిన్ని వివరాలు అందజేస్తామని ఆర్మీ అధికారులు చెప్పారు. ఫిబ్రవరి నెలలో టాకీత్నా నుంచి టేకాఫ్ అయిన తర్వాత అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.

 

Tags; Two downed army helicopters

Post Midle
Post Midle