బాపట్ల ముచ్చట్లు:
బాపట్ల జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున రోడ్డు ప్రక్క ఆగి ఉన్న లారీని మరో లారీ వెనుక నుండి బలంగా ఢీకొంది. ఈఘనలో మధురైకి చెందిన రాజు టంగుటూరుకు చెందిన మేడవరపు సురేష్ అక్కడికక్కడే మృతి చెందారు. వీరిరువురూ డ్రైవర్లు గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీ క్యాబిన్లో ఇరుక్కున్న సురేష్ ని అతికష్టం మీద బయటికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ అక్కేశ్వరరావు తెలిపారు.
Tags: Two drivers died in a road accident