త్రివిధ దళాల్లో మరో రెండు బలగాలు

Date:09/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశ భద్రతకు కొత్తగా ముంచుకొస్తున్న ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు త్రివిధ దళ ఉమ్మడి విభాగంలో కొత్తగా సైబర్, ఏరోస్పేస్, ప్రత్యేక బలగాల శాఖలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం.. సమీకృత రక్షణ సిబ్బంది విభాగానికి సూచించింది. కొత్తగా ఏర్పడే మూడు విభాగాలకు మేజర్ జనరల్ హోదా అధికారులు నాయకత్వం వహిస్తారు. అదనంగా సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం లేకుండానే వీటిని ఏర్పాటు చేయనున్నారు. మూడు విభాగాల్లో త్రివిధ దళాల సిబ్బంది ఉంటారు. ప్రతిపాదిత సైబర్ వ్యవస్థ జాతీయ సైబర్ భద్రత సమన్వయకర్త, కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ తో కలసి పనిచేస్తుంది. ప్రత్యేక బలగాల విభాగంలో వైమానిక దళానికి చెందిన ‘గరుడ్’, నౌకాదళ ‘మెరైన్ కమాండో’లు, సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు ఉంటాయి.
Tags; Two forces in tri-forces

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *