వాగులో ఇద్దరు గల్లంతు
కడప ముచ్చట్లు:
కడప జిల్లా గోపవరం మండలం వల్లెలవారిపల్లి ఆటవీప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. గత రాత్రి నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దుర్గం పల్లికి చెందిన తొమ్మిది మంది వ్యక్తులు తేనె కోసం ఫారెస్ట్ కొండ ప్రాంతానికి వెళ్లారు. తేనెను సేకరించి రాత్రి చెట్ల కింద పందుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కొండ పై భాగంలో కురిసిన భారీ వర్షానికి ఒక్క సారిగా వాగు ప్రవహించింది. హాయిగా నిద్రోస్తున్న తొమ్మిది మందిలో ముగ్గురు వ్యక్తులు నీటిలో కొట్టుకొనిపోయి గల్లంతయ్యారు. వారిలో ఒకరు క్షేమంగా బయటకి వచ్చారు. వీరు ఉదయగిరి మండలం దుర్గంపల్లికి చెందిన మామిళ్ల రమేష్ , మామిళ్ల వెంగయ్య గా గుర్తించారు. మిగిలిన వారు గల్లంతయిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల మరిము బద్వేల్ రూరల్ పోలీసుల సహకారంతో గల్లంతైన వారిని చాలా సమయం పాటు వెతికి వెలికితీశారు. ఈ నెపద్యం లో హెడ్ కానిస్టేబుల్ తన వయస్సుకూడా లెక్క చెయక మృతదేహాన్ని మొకాలి లోతునిటి లో మోసిన వైనం పలువురు హర్షం వ్యక్తం చెశారు మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఉదయగిరి సిఐ గిరిబాబు యస్ ఐ లక్కీ పురుష మృతుని కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించారు.
Tags: Two gallant in the gorge

