ఇంటి పార్టీకి రెండే… రెండా

Two home for two ...

Two home for two ...

Date:12/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
మహాకూటమిలో తెలంగాణ ఇంటి పార్టీని కలుపుకునేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ ఇంటి పార్టీ తీవ్ర ప్రభావం చూపనుండడంతో ఆ పార్టీని కలుపుకుపోతే.. మహాకూటమికి లాభం చేకూరుతుందనే ఉద్ధేశంతో ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆది నుంచి చెరుకు సుధాకర్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సుపరిచితుడు కావడంతో పాటు ఇంటి పార్టీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ప్రభాల్యాన్ని పెంచుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర కల సాకారం వరకు ఆయన టీఆర్‌ఎస్‌లోనే సుదీర్ఘకాలం కొనసాగారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరి ఆయన భార్య చెరుకు లక్ష్మీని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించారు.
ఆ ఎన్నికల్లో చెరుకు ప్రభావంతో ఫలితాలు తారుమారయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మహాకూటమిలో ఇంటి పార్టీని భాగస్వామ్యం చేసేందుకు కొద్దిరోజులుగా చర్చలు సాగుతున్నాయి.మహాకూటమిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇంటి పార్టీ ఆరు స్థానాలను ఆశిస్తోంది. ఇందులో ప్రధానంగా నకిరేకల్(చెరుకు సుధాకర్ భార్య చెరుకు లక్ష్మీ), మహబూబ్‌నగర్(యన్నం శ్రీనివాస్‌రెడ్డి), షాద్‌నగర్(రామేశ్వర్‌గౌడ్)తో పాటుగా మరో మూడు స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం అడుగుతోంది. అయితే నకిరేకల్ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశంపై స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు.
ఈ కారణంగా నకిరేకల్ టికెట్‌ను ఇంటి పార్టీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు. దీంతో పాటు లింగయ్య.. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రధాన అనుచరుడిగా ఉండడంతో ఆ టికెట్ ఇవ్వడం కష్టసాధ్యమని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇంటి పార్టీ మాత్రం.. నకిరేకల్ స్థానం కావాలని పట్టుపడుతోంది. ఈ విషయంపై ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్‌తో చర్చలు జరిగాయి.
అయితే నకిరేకల్‌కు బదులుగా తుంగతుర్తి స్థానం తీసుకోవాలని చెరుకు సుధాకర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఇంటి పార్టీ ఉపాధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌రెడ్డి కోసం మహబూబ్‌నగర్ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే చెరుకు సుధాకర్‌తో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తదితరులు పొత్తుపై చర్చలు జరిపారు. ఆరు స్థానాలు కాకుండా రెండు ఇస్తారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఇవీగాక జనరల్ స్థానమైన కోదాడ, భువనగిరి స్థానాలూ ఇస్తామన్నట్టు సమాచారం.
Tags:Two home for two …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *