రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నెల్లూరు ముచ్చట్లు :
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపు బట్టి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కంటైనర్ లారీ ముందు పోతున్న ఆటోను డీ కొట్టింది. ఆ సమయంలో ఆటోలో 18మంది భవాని స్వాములు ప్రయాణిస్తున్నారు. వారిలో ఇద్దరు మృతి చెందారు. ఐదుమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కావలి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. వీరందరూ అల్లూరు మండలం సింగపేట పంచాయితీ చెలిక సంఘం గ్రామానికి చెందినవారు. కోవూరులో భజన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెల్తుండగా ఘటన చోటుచేసుకుంది.
Tags: Two killed in a road accident

