Flaming Call Money Merchants

సత్యవేడు నాగలాపురం మండలాల్లో కరోనాతో ఇద్దరు మృతి..!?

– ప్రజలు పారా హుషార్..

Date:03/06/2020

సత్యవేడు ముచ్చట్లు:

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో విలయం కొనసాగిస్తుంది.. నిన్న మొన్నటి వరకు కరోనా కేసులు నమోదు లోనే ఉన్న ఈ నియోజకవర్గంలో తాజాగా కరోనా వ్యాధి వచ్చిన ఇద్దరు మహిళలు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు అన్న విషాదకరమైన వార్త అందర్నీ ఆందోళనకు గురి చేస్తుంది, సత్యవేడు కు చెందిన ఓ మహిళ నాగలాపురం మండలానికి చెందిన మరో మహిళ ..కరోనా మహమ్మారి తో పోరాటం చేసి తుది శ్వాస విడిచారు అన్న సమాచారం కలచివేస్తుంది.. మృతి చెందిన ఇద్దరు మహిళలు వయసు పైబడిన వారి గా వైద్యులు గుర్తించారు వైద్యులు సాయశక్తులా ప్రయత్నించి వారికి మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేసిన చికిత్సకు శరీరం సహకరించక మంగళవారం రాత్రి ఇద్దరు మృత్యువు ఓడిలోకి చేరుకున్నారు… నిన్న ఒక్కరోజే సత్యవేడు నియోజకవర్గ వ్యాప్తంగా ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి నమోదైన కేసుల అన్ని బయట ప్రాంతాల నుంచి తాజాగా ఈ నియోజకవర్గంలో కి వచ్చే వారికి మాత్రమే నమోదయ్యాయి.ప్రభుత్వం సడలింపు ఇచ్చింది సరదాగా బయట తిరుగుదాం అనుకునే వారు మాత్రం తస్మాత్ జాగ్రత్త, సడలింపులు మనుషులు ,వాణిజ్యం ,వర్తకానికి మాత్రమే కరోనా వైరస్ కి మాత్రం కాదు..!?

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Tags: Two killed in Corona in Nagalapuram zones

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *