గంగవరం నాలుగు రోడ్లు ఫ్లైఓవర్ పైన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
గంగవరం ముచ్చట్లు :
గంగవరం మండలం నాలుగు రోడ్లు ఫ్లైఓవర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలు బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లికి చెందిన మణి, కవిత కుటుంబం బెంగళూరులో స్థిరపడ్డారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి కారులో స్వగ్రామం బేలుపల్లికి బయలుదేరారు. గంగవరం మండలం నాలుగు రోడ్లు ఫ్లైఓవర్ పై అతివేగంగా వస్తు ముందర వెళుతున్న దోస్త్ వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 10 నెలల చంటి పాప కార్మిక అక్కడికక్కడే మృతి చెందింది. పాప తల్లిదండ్రులు యువరాజు, అర్చన ఇద్దరికి తీవ్ర గాయాలై వేలూరు సిఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా దోస్త్ వాహనం డ్రైవర్ ఇమ్రాన్ భాషకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags; Two killed in road accident on Gangavaram four road flyover
