Natyam ad

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం…ఇద్దరు మృతి

ఒంగోలు ముచ్చట్లు:
 
చెన్నై- కలకత్తా 16వ నెంబరు జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జె.పంగులూరు మండలం రేణంగివరం వద్ద సుబాబుల్ లోడు ట్రాక్టర్ ను
వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం వాటర్ ట్యాంకు ఎదురు సోదా వెంకట్రావు, కళావతి దంపతులు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ప్రసన్న, భాస్కర్ లు ఉన్నారు. పెద్ద
కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు భాస్కర్ ను అమెరికా పంపించేందుకు చెన్నై ఎయిర్పోర్ట్ కు కారులో బుధవారం రాత్రి వెళ్లారు. ఫ్లైట్ ఎక్కించి వెంకట్రావు, కళావతి,
ప్రసన్నలు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. వీరిలో వెంకటరావు, ప్రసన్న లు మృతి చెందగా కళావతి, డ్రైవర్  తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. పొద్దు పొద్దున్నే ఈ విషాద
వార్త అందడంతో చిలకలూరిపేట పట్టణంలోని సాంబశివ నగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Two killed in road mishap on national highway

Leave A Reply

Your email address will not be published.