అతి వేగంతో అదుపు తప్పిన కారు…ఇద్దరు మృతి
మేడ్చల్ ముచ్చట్లు:
మేడ్చల్ జాతీయ రహదారి మేడ్చల్ చెక్ పోస్ట్ , బావర్చి హోటల్ ముందు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కింది. దాంతో కారు లో వున్న తొమ్మిది మందిలో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలు అయ్యాయి. రామాయం పేట నుండి హైదరాబాద్ నగరానికివస్తున్న మారుతీ ఎకో వాహనం ఢివైడర్ ఢీ కొని ప్రమాదం జరిగింది. మృతులు మధ్య ప్రదేశ్ కి చెందిన గోరా సింగ్, బిబ్బు సింగ్ లుగా గుర్తించారు. మిగిలిన వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రి కి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Two killed in speeding car crash