వాగులో పడి ఇద్దరు మృతి

Date:30/05/2020

నల్గోండ ముచ్చట్లు:

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన బావ బామ్మర్దులు వాగు నీటిలో పడి చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తిమ్మాయిపాలెం గ్రామానిలో బావ బామ్మర్దులు సరదాగా ఈత కోసమని సమీపంలోని వాగులోకి వెళ్లారు. ఈ క్రమంలో వాగులో ఈత కొట్టే సమయంలో రమావత్ రగేష్ నాయక్(25), శీను నాయక్(22) నీటిలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. అటు వైపు వెళ్తున్న స్థానికులు గమనించి వాగులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన రమావత్ రాగేశ్ నాయక్  స్వగ్రామం నెహ్రూ నగర్ తండ గుంటూరు జిల్లా.మరో మృతుడు శీను నాయక్ ది దుర్గి మండలం గండిగనుమల స్వస్థలం.ఈ నేపథ్యంలో తన బంధువుల ఊరు అయిన తిమ్మాయిపాలెం కి వచ్చారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. దీంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ప్రతి గడపకు ప్రభుత్వ సేవలు

Tags: Two killed in Wagu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *