Two lakh lads left in Tirumala

తిరుమలలో మిగిలిపోయిన రెండు లక్షల లడ్డూలు

Date:27/03/2020

తిరుమల ముచ్చట్లు:

కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంకన్నపై కూడా పడింది. వైరవస్ విజృంభిస్తుండటంతో ముందు జాగ్రత్తగా తిరుమలలో దర్శనాలు నిలిపివేశారు. భక్తుల్ని స్వామివారి దర్శనానికి అమనుతించడం లేదు.. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాలను పూర్తిగా మూసివేశారు. తిరుమల గిరులు భక్తులు లేక వెలవెలబోతోంది. ఇక స్వామివారికి రోజువారి కైంకర్యాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా తిరుమలకు కళ తప్పింది. తిరుమలకు భక్తుల రాక నిలిచిపోవడంతో.. భక్తుల కోసం సిద్ధం చేసిన లడ్డూలు అక్కడే పేరుకుపోయాయి. ఏకంగా 2 లక్షల వరకు లడ్డూలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

 

 

 

 

ఏ లడ్డూలకు సంబంధించిన వ్యవహారంపై టీటీడీ అధికారులు చర్చించారు. ఈ లడ్డూల్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే గతంలో తిరుమల లడ్డూలకు ఉండే డిమాండ్‌ దృష్ట్యా అదనంగా లడ్డూలు తయారు చేస్తుంటారు. కానీ కరోనా ఎఫెక్ట్‌తో శ్రీవారి దర్శనాలు నిలిపివేయడంతో ఇవన్నీ మిగిలిపోయాయి. అందుకే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల్ని అనుమతించడం లేదు.ఈ క్రమంలో ఉచితంగా భక్తులకు లడ్డూలను అందించేలా యంత్రాంగం నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

208 మందికి స్వీయ నిర్భంధం

Tags: Two lakh lads left in Tirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *