Two members appointed as members of the board

తితిదే బోర్డు సభ్యులుగా ఇద్దరి నియమకo

Date:17/02/2019

అమరావతి  ముచ్చట్లు:

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా మరో ఇద్దరికి అవకాశం లభించింది. నెల్లూరుకు చెందిన వేనాటి రామచంద్రారెడ్డి, కడప జిల్లా రాయచోటికి చెందిన సుగవాసి ప్రసాద్‌బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తితిదే బోర్డు సభ్యురాలిగా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తన నియామకాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే అనిత కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ నియామకాన్ని రద్దు చేసింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను తితిదే బోర్డు మెంబర్‌గా నియమించినప్పటికీ ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో ఆయన నియామకాన్ని దేవాదాయశాఖ రద్దు చేసింది. దీంతో.. ఖాళీగా ఉన్న రెండు పోస్టులను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

స్టైఫండరీ కేడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల పరీక్షలు

 

Tags: Two members appointed as members of the board

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *