ఆత్మకూరు నియోజకవర్గానికి త్వరలో మరో రెండు భారీ ప్రాజెక్ట్ లు

రూ.264 కోట్లతో ఆత్మకూరులో అభివృద్ది పనుల పరుగులు
నియోజకవర్గ అభివృద్ది కోసం నా శాయశక్తులా కృషి చేస్తా
చేజర్ల మండల స్థాయి సమీక్షలో మంత్రి మేకపాటి
నెల్లూరు ముచ్చట్లు :
ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ది తన శాయశక్తులా కృషి చేస్తానని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు.  ఆత్మకూరు నియోజకవర్గంలో పరిశ్రమల శాఖ ద్వారా 2 భారీ ప్రాజెక్ట్ లు రానున్నాయని, వాటి ద్వారా నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశముందని ఆయన  పేర్కొన్నారు.  మండల కేంద్రమైన చేజర్లలో  ఆయన మండల ఆభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ గణేష్, డ్వామా పీడీ తిరుపతయ్య, ఆత్మకూరు ఆర్డీఓ ఏ. చైత్రవర్షిణిలతో కలసి మండలస్థాయిలో నిర్వహించిన ఈ సమీక్షలో వివిధ ప్రభుత్వ శాఖలలో జరుగుతున్న పనులను ఆయా ఆధికారులతో సమీక్షించారు.
ఆత్మకూరు నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనుల కోసం ఏడాదిన్నర వ్యవధిలో రూ.264 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఆయితే ఆయా పనులలో జరుగుతున్న ఆలస్యమవుతుండడంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆసంతృప్తి వ్యక్తం చేశారు.
తొలుత కోవిడ్ వ్యాప్తి, తీసుకున్న చర్యల గురించి వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. మండలంలో మొత్తం 11,588 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేసినట్లు పీ హెచ్ సీ డాక్టర్ వెంకటాచలపతి వివరించారు. కరోనా వైరస్ మూడో విడత విజృంభణ రానుండడం పట్ల తీసుకునే ముందస్తు జాగ్రత్తల గురించి అధికారులకు మంత్రి గౌతమ్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ 2 డోసులు వేయించుకుంటే ఎదుర్కోవడం సులభమవుతుందని అన్నారు. ఈ విషయంలో ఆరోగ్య సిబ్బంది చొరవ చూపి నూరు శాతం వ్యాక్సినేషన్ అయ్యేలా చూడాలన్నారు.
నాడు నేడు పనుల గురించి పంచాయతీరాజ్, విద్యాశాఖ ఆధికారులతో మాట్లాడుతూ తొలి విడతలో 21 పాఠశాలలను నాడు నేడు పనులు 88 శాతం పూర్తి అయినట్లు ఆధికారుల ద్వారా తెలుసుకున్నారు. రెండో విడతలో 17 పాఠశాలలు నమోదు చేస్తే 14కే మంజూరయ్యాయని ఎంఈఓ కళాధర్ తెలపడంతో మిగిలిన మూడు పాఠశాలలు వెంటనే చేర్చాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో పాఠశాలల్లో జరిగిన నాడు నేడు పనుల వివరాలను ఆడిగి తెలుసుకున్నారు. ఫర్నిచర్, టీవీలు, నోటు పుస్తకాలు 80 శాతం చేరాయని అధికారులు వివరించారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సచివాలయాలు, పాల శీతలీకరణ కేంద్రాలు, ఆర్టికె, విలేజ్ క్లినిక్ భవనాల నిర్మాణాల్లో తీవ్ర ఆలస్యమవుతుండడంతో ఆయన ఆసహనం వ్యక్తం చేశారు.
నిధులు మంజూరైన అధికారుల ఆలసత్వమా, పర్యవేక్షణ లోపమా అని ప్రశ్నించారు. పలు చోట్ల సిమెంటు సక్రమంగా ఆందడం లేదని ఏజెన్సీలు తెలపడంతో ఆయన ఆ విషయం వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీని ఆదేశించారు. బిల్లుల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, తానే స్వయంగా పరిశీలించి వెంటనే మంజూరయ్యేలా చూస్తానని హామి ఇచ్చారు. మూడు నెలల వ్యవధిలో మండలంలో నిర్మాణంలో ఉన్న 56 భవనాల పనులు పూర్తి కావాలని ఆయన ఆధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో సాకులు చెప్పవద్దని, ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. ముఖ్యంగా పాల శీతలీకరణ కేంద్రాలు గ్రామాలకు మధ్యలో ఏర్పాటు చేయాలని, అధికారులు ఈ విషయమై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్పంచు సహకరించకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జలజీవన్ పనులపై మాట్లాడుతూ 22 పనులు చేయాల్సి ఉండగా ఐదు పనులు మాత్రమే ప్రారంభం కావడం ఏమిటని ఆయన ఆడబ్యూ యస్ ఆధికారులను ప్రశ్నించారు. మార్చిలో మంజూరైన నిధులు ఉపయోగించుకోకపోవడం దారుణమని, ఎప్పటికప్పుడు పనులు వేగవంతం చేస్తూ నివేదిక ఆందచేయాలని ఆదేశించారు.
రేషన్ పంపిణీ విషయంలో వాహనదారులు ఇష్టారాజ్యంగా లబ్ది దారులకు అందచేయకూడదని, ఈ విషయమై పలు ఫిర్యాదులు అందుతున్నాయని ఆర్డీఓ చైత్రవర్షిణిని మరోసారి ఫిర్యాదు రాకుండా పరిశీలించాలని ఆదేశించారు. ఆనంతరం ఉపాధి పనులపై మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి 150 రోజుల పనిదినాలు కల్పించాలని, కరోనా కష్టకాలంలో ఉపాధి పనులే ఎంతో ఆధారమని ఆయన అన్నారు.
ఆనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గత ఏడాదిన్నరగా కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా వైఎస్సార్ చేయూత, ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర తదితర పథకాల ద్వారా లబ్దిదారులకు నగదు వారి ఖాతాలకే జమ చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమైందన్నారు. త్వరలో ఆత్మకూరు ఎంఎస్ఎం పార్కులో ఓ కంపెని ప్రారంభం కానున్నట్లు, ఏడాది వ్యవధిలో మరో కంపెని ప్రారంభమవుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు స్వంతప్రాంతంలోనే లభించేలా చేస్తున్నామని మంత్రి గౌతమ్ రెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమంలో విజయా డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఉపాధి ఏపీడి శంకరనారాయణ, వివిధ శాఖల అధికారులు, ఎస్సార్‌ సీపీ నాయకులు మండల కన్వీనర్ తూమాటి విజయభాస్కర్ రెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ బూదళ్ల వీరరాఘవరెడ్డి, పీర్ల పార్థసారధి ఏఎంసీ వైస్ చైర్మన్ గోతం వెంకటసుబ్బయ్య, మదమంచి వెంకటరత్నం, గోనుగుంట రాంబాబు, ఏ శ్రీనివాసులునాయుడు, మహ్మద్ రఫీ, పెంచలనాయుడు, తిరుపతినాయుడు, ఆత్మకూరు నాయకులు డాక్టర్ కెవి శ్రావణ్ కుమార్, డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, గడ్డం శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Two more big projects coming soon for Atmakuru constituency

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *