టెట్‌లు రెండు…చిత్తూరు జిల్లాకు పోస్టులు రెండు

Two of the tetris ... Two posts to Chittoor district

Two of the tetris ... Two posts to Chittoor district

– నిరుద్యోగుల బ్రతుకులు రెండాయే

Date:08/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం ఆనాలోచిత చర్యలు కారణంగా నిరుద్యోగులకు రెండు టెట్‌ పరీక్షలు నిర్వహించారు. కానీ చిత్తూరు జిల్లాకు కేటాయించిన ఎస్‌జిటి పోస్టులు మాత్రం రెండు కావడంతో వేలాది మంది నిరుద్యోగుల బ్రతుకులకు మార్గంలేకపోగా, నిరుద్యోగులు రోడ్డుపై ధర్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సోమవారం పుంగనూరులో నిరుద్యోగులు, ఏబివిపి విద్యార్థులు కలసి ర్యాలీ నిర్వహించారు. గోకుల్‌ సర్కిల్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు మద్దతుగా ఏబివిపి కన్వీనర్‌ సోమశేఖర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల్లో చిత్తూరు జిల్లాకు 207 పోస్టులను కేటాయించి, అందులో ఎస్‌జిటి పోస్టులను రెండు మాత్రమే కేటాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా అదిగో డిఎస్సీ….ఇదిగో ఉద్యోగం అంటు నిరుద్యోగులకు ఆశపెట్టడంతో నిరుద్యోగులు వేలాది రూపాయలు ఖర్చుచేసి, కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందారని తెలిపారు. అలాంటి సమయంలో నిరుద్యోగులకు 207 పోస్టులను మాత్రమే కేటాయించడం బాధకరమన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, పోస్టులు పెంచాలన్నారు. లేకపోతే ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసి, నిరుద్యోగులకు కడుపుకోత పెట్టవద్దని కోరారు. ఈ విషయమై విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించాలన్నారు. లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు శ్రీకాంత్‌, రవీంద్ర, కిషోర్‌కుమార్‌, గోపిక్రిష్ణ, శ్రీనివాసులు, చెంచురాం, మోహన్‌బాబు, చరణ్‌, భార్గవ్‌, రెడ్డెప్ప, వినోద్‌కుమార్‌, ప్రవీన్‌కుమార్‌, సుదర్శన్‌బాబు, లావణ్య, శిరీణ్‌, ఏబివిపి నేతలు హరీష్‌, సాయి, లీలాప్రసాద్‌, బాలాజి, గోపి, ధరణి, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్కా, చెల్లెలు ఆత్మహత్య

Tags: Two of the tetris … Two posts to Chittoor district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *