వీధిలో రెండు పంచాయితీలు

Date:11/01/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా నేరుడుచర్ల మండలంలో ఒకే వీధిలో రెండు పంచాయతీలు ఉన్నాయి. మండలంలో బోడల్‌దిన్న పంచాయతీ రహదారికి ఒకవైపు, మరొకవైపు చిల్లెపల్లి పంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన చింతకుంట్ల గ్రామం ఉంది. తెలియనివారికి ఈ వీది మొత్తం ఒకే గ్రామంగా కనిపిస్తుంది. కాని వీధికి ఒకవైపు ఒక గ్రామం, మరొకవైపు ఇంకొక గ్రామం. ఇది అరుదైన విషయం. రెండు పంచాయతీలకు ఒకే వీధి ఉండడం వల్ల పారిశుద్ధ్యం, వీధిలైట్లు, తాగునీటి తదితర వౌలిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
రెండు గ్రామాలకు ఒకే వీధి అనుసంధానంగా ఉన్నప్పటికీ ప్రజలందరు కలిసి జీవిస్తున్నప్పటికీ పథకాల ఎంపికలో ఆయా పంచాయతీల ద్వారానే ఎంపిక చేస్తారు. బోడల్‌దిన్న పంచాయతీ సుమారు 20 ఏళ్ల కింద ఏర్పాటుచేశారు. గతంలో చిల్లెపల్లి పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని ఎనిమిది వార్డులతో ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటుచేశారు.
ఈ పంచాయతీలో 434 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో జనరల్ కేటగిరి కింద ఎన్నిక నిర్వహిస్తున్నారు. చిల్లెపల్లి పంచాయతీలో పది వార్డులకు 1428 మంది ఓటర్లు ఉన్నారు. ఈనెల 30న జరగనున్న ఎన్నికల్లో బీసీ జనరల్‌గా కేటాయించారు. చిల్లెపల్లికి అనుబంధంగా ఉన్న చింతకుంట్లను భవిష్యత్తులో బోడల్‌దిన్న పంచాయతీలో విలీనం చేయాలని కోరుతున్నారు.
Tags: Two panchayats on the street

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *