రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి
తణుకు ముచ్చట్లు:
తణుకు వద్ద రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తణుకు బస్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రగాయాలతో మృతి చెందారు. భీమవరం వైపు లేదా నిడదవోలు వైపు వెళ్లే రైలు బస్ స్టేషన్ లోనికి వెళ్లేందుకు లేదా బస్ స్టేషన్ నుంచి పట్టణంలోనికి వెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురి మృత దేహాలు వద్ద చిన్న బట్టలు సంచి తప్ప ఏమి ఆధారాలు లేకపోవడంతో వివరాలు సేకరిస్తున్న రైల్వే పోలీసులు, మృతులు ఇద్దరు బీహారు వాసులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Tags: Two people died in a train collision

