పుంగనూరులో అక్రమ మధ్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
పుంగనూరు ముచ్చట్లు:
కర్నాటక నుంచి అక్రమంగా మధ్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 670 టెట్రాప్యాకెట్లు, 9 బ్రాంది బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. శనివారం రాత్రి సీఐ మాట్లాడుతూ పట్టణానికి చెందిన సయ్యద్‌ముష్రాప్‌అలీ, జూనాద్ లు ఆటోలో అక్రమ మధ్యం రవాణా చేస్తుండగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. మద్యం విలువ రూ.30 వేలు అని ఆయన తెలిపారు. నింధితులను ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ అశోక్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Two people were arrested for smuggling illegal drugs in Punganur
