పుంగనూరులో ఇద్దరు వ్యక్తులు, ఆరుకేజిల గంజాయి స్వాధీనం

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలో అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి ఆరుకేజిల గంజాయి స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ గంగిరెడ్డి ఆదివారం తెలిపారు. ఆయన కథనం మేరకు పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీలో నివాసం ఉన్న ఆవుల కృష్ణ, అతని చిన్నాన్న ఆవుల కృష్ణప్ప కలసి గంజాయిని పుంగనూరుకు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో సింగరిగుంట వద్ద ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బందితో కలసి పట్టుకున్నామన్నారు. వీరి వద్ద నుంచి ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని , కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించామన్నారు. ఈ దాడుల్లో కానిస్టేబుళ్లు రెడ్డెప్ప, యల్లప్ప, గురురాజు, మోహన్‌రామ్‌ పాల్గొన్నారని తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Two persons seized six kgs of cannabis in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *