మిగ్ జెట్ కూలి ఇద్దరు పైలట్లు మృతి

 

న్యూఢిల్లీ ముచ్చట్లు


వైమానిక దళానికి చెందిన మిగ్ -21 జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిక్షణనిస్తున్న ఇద్దరు పైలెట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన రాజస్థాన్లోని బార్మర్లో గురువారం రాత్రి జరిగింది. శిక్షణలో భాగంగా రాజస్థాన్లోని ఉతర్లె ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన మిగ్ -21 జెట్ రాత్రి 9.10 గంటల సమయంలో బార్మర్ సమీపంలో ప్రమాదానికి గురై కూలిపోయింది. అందులోని , ఇద్దరు పైలెట్లు మృతిచెందారని వైమానిక దళం (ఐఎఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. ఘటన జిల్లా కేంద్రానికి 37 కిలోమీటర్లల దూరంలోని ఇస్రామాన్ కా తలా గ్రామంలో జరిగింది.  పైలెట్ల మృతికి సంతాపం తెలుపుతున్నట్లు ఐఎఎఫ్ పేర్కొంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్లు ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Tags:Two pilots killed in MiG jet crash

Leave A Reply

Your email address will not be published.