మొక్కజొన్నకు రెండు ధరలు

Date:04/12/2020

నిజామాబాద్ ముచ్చట్లు:

రైతులు అమ్మేశాక, మార్క్ఫెడ్ కొంటుంటే.. రూ. 1,760 నుంచి రూ. 2 వేలు.. .. రాష్ట్రంలో మక్కల ధరల తీరు ఇది. పంట మార్కెట్కు వచ్చే సరికి మార్క్ఫెడ్ కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు, దళారులు అడ్డగోలుగా రేటు తగ్గించేశారు. మక్కలు తడిశాయని, బాగా లేవని, పచ్చిగా ఉన్నాయని సాకులు చెప్పారు. ఇలా రెండు నెలల పాటు నచ్చిన ధరకు కొన్నారు. దాదాపు రైతులంతా అయినాకాడికి పంటను అమ్మేసుకున్నాక మార్క్ఫెడ్ తీరిగ్గా కొనుగోలు కేంద్రాలు తెరిచి, మద్దతు ధరతో కొనుగోళ్లు మొదలుపెట్టింది. దాంతో మార్కెట్లో పోటీ పెరిగి మక్కల ధర పెరిగింది. ఏకంగా క్వింటాల్ రూ.2 వేల స్థాయికి చేరింది. దీంతో రైతులంతా లబోదిబోమంటున్నారు. మార్క్ఫెడ్ అధికారులు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతులను ముంచారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.రాష్ట్రంలో మొక్కజొన్న సాధారణ సాగు 12,38,210 ఎకరాలుకాగా.. ఈ ఖరీఫ్ లో 9,84,613 ఎకరాల్లోనే వేశారు. దానికితోడు అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో కురిసిన వర్షాలతో పంట దెబ్బతిన్నది. అప్పటికే తెంపిన మక్కలు తడిసిపోయాయి. ఎలాగోలా ఎండబెట్టుకుని మక్కలను మార్కెట్‌‌‌‌‌‌‌‌కు తెస్తే.. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు లేవు. మద్దతు ధరా లేదు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై మక్కల ధర తగ్గించేశారు. మక్కలు బాగాలేవు, తడిశాయి, పచ్చిగా ఉన్నాయంటూ వంకలు పెట్టారు. ఏ వ్యాపారి దగ్గరికి వెళ్లినా అదే మాట చెప్పారు.

 

 

రైతులకు ఏ మార్గం లేక ఆందోళనకులోనై తక్కువ ధరకు అమ్ముకునేలా చేశారు. క్వింటాల్ మక్కలకు రూ.1,100 నుంచి రూ.1,400లోపు వరకే ధర చెల్లించారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌ జిల్లా నర్సంపేట మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అయితే క్వింటాల్‌‌‌‌‌‌‌‌ కేవలం రూ. వెయ్యి చొప్పునే కొన్నారు.ఖరీఫ్లో మక్కలు ఒక్కో ఎకరానికి 30/35 క్వింటాళ్ల దాకా పండుతాయి. కానీ ఈసారి అక్టోబర్లో పడ్డ భారీ వర్షాల కారణంగా ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ఇంతా చేసి మార్కెట్కు తీసుకెళ్తే అయినకాడికి అమ్ముకునేలా చేశారు. మర్రిమిట్ట గ్రామానికి చెందిన బూర్క ప్రకాష్‌‌‌‌‌‌‌‌ అనే రైతు రెండెకరాల్లో మక్కలు వేశారు. వర్షాలతో పంట నష్టపోయి ఎనిమిది క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. దానిని మార్కెట్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్తే కూలీలు, రవాణా పైసలు కూడా రాలేదని ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారుదాదాపు 70 శాతం మక్కలను రైతులు అమ్ముకున్నాక మార్క్ఫెడ్ తాపీగా కొనుగోలు కేంద్రాలను తెరిచింది. చివరి దశలో రూ.1,760 మద్దతు ధరతో కొనుగోళ్లు ప్రారంభించింది.

 

 

దాంతో ఇప్పుడు పంట తెస్తున్న రైతులంతా మార్క్ఫెడ్ కేంద్రాలకు వెళ్తున్నారు. అది గమనించిన వ్యాపారులు, దళారులు మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌  కన్నా ఎక్కువ ధర పెట్టి కొనుగోళ్లు చేస్తున్నారు. వ్యాపారుల మధ్య కూడా పోటీ పెరగడంతో వారం రోజులుగా మక్కల ధర మరింతగా పెరిగి సుమారు రూ.2వేలకు దగ్గరగా వచ్చింది. దీంతో మొదట్లోనే పంటను అమ్ముకున్న రైతులంతా లబోదిబోమంటున్నారు. మార్క్ఫెడ్ ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే.. తమకు మద్దతు ధర దక్కేదని వాపోతున్నారు.వ్యాపారులతో మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ అధికారులు కుమ్మక్కయ్యారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పంట దిగుబడులు మొదలయ్యే ముందు వరకు మార్కెట్లో మంచి ధరలు పలికాయని.. కాని మార్క్ఫెడ్ అధికారులు, వ్యాపారులు కలిసి ధరలు లేకుండా చేశారని మండిపడుతున్నాయి. మార్క్ఫెడ్ అధికారులు కావాలనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, దానివల్ల రైతులు తక్కువ ధరకు పంట అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోతున్నాయి. ఇదంతా మార్కెట్ మాయాజాలమని.

 

 

పంట చేతికి రాకముందు ధరలు ఎక్కువగా ఉన్నాయని, దిగుబడిని మార్కెట్కు తెచ్చేసరికి తగ్గించేశారని, వ్యాపారులు తక్కువ ధరకు కొనేశాక మళ్లీ ధరలు పెరిగాయని అంటున్నాయి. రైతులను దారుణంగా మోసం చేశారని, తీవ్రంగా నష్టపోయారని మండిపడుతున్నాయి.దేశవ్యాప్తంగా కూడా మొక్కజొన్న సాగు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచడంతో ఇతర దేశాల నుంచి మక్కల దిగుమతులు నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో లోకల్గా డిమాండ్ పెరిగింది. ధర మరింతగా పెరిగే అవకాశముందని వ్యాపారులు కొనుగోళ్లకు పోటీ పడుతున్నారు. మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువగా రేటు వస్తోంది. అయితే రెండు నెలల ముందు నుంచే ఈ పరిస్థితి ఉన్నా లోకల్ మార్కెట్లలో మాత్రం ఇప్పుడిప్పుడే ధరలు పెంచారు.

 రాజులకు కలిసి రాని కాలం..

Tags: Two prices for corn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *