– హంద్రీనీవా కాలువ విస్తరణ
– మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి
Date:23/05/2020
పుంగనూరు ముచ్చటు:
చిత్తూరు జిల్లాలో మంచి నీటి సమస్య పరిష్కరించేందుకు రెండు రిజర్వాయర్లు నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అనుమతులు ఇచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి పట్టణంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ ప్రజలనుద్ధేశించి మాట్లాడుతూ ఏడాది పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అమలు చేశారని తెలిపారు. జిల్లాలోని హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి, రైతులకు మరింతగా నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే నేతిగుట్లపల్లె వద్ద , సోమల మండలం చిత్తూరు వద్ద కూడ రిజర్వాయర్లు నిర్మించేందుకు అనుమతులు లబించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్, పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, కొండవీటి నాగభూషణం, ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్ ముత్తంశెట్టి విశ్వనాథ్ , మాజీ జెడ్పి ప్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి , ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి , మున్సిపల్ మాజీ వైస్ ఆవుల అమరేంద్ర, ఆర్టీసి మజ్దూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి, కమిషనర్ కెఎల్.వర్మ , సీఐ గంగిరెడ్డి, తహశీల్ధార్ వెంకట్రాయులు, ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు, కౌన్సిలర్ అభ్యర్థులు కొండవీటి నాగేంద్ర, త్యాగరాజు, మనోహర్, అమ్ము, అర్షద్‌అలి, శ్రీనివాసులు, నరసింహులు, యువజన సంఘ నాయకులు రాజేష్, చెంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సురేష్, జెపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు ,కార్మికులకు , 108 వారికి సరుకులు పంపిణీ…….
కరోనా నియంత్రణలో భాగంగా విశిష్ట సేవలు అందించిన పోలీసులకు, మున్సిపల్ కార్మికులకు, 104, 108 వైద్య సిబ్బందికి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే లీనార్డ్ హైస్కూల్లో వాణిలక్ష్మీ అనే ఉపాధ్యాయురాలు నూతనంగా నిర్మించిన సరస్వతిదేవి విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు, ఆర్టీసి డిపోను పరిశీలించి త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్, జెడ్పిమాజీ ప్లోర్‌లీడర్ వెంకటరెడ్డి యాదవ్, ఆర్టీసి మజ్ధూర్ సంఘ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అమరేంద్ర, కౌన్సిలర్ అభ్యర్థులు త్యాగరాజు, మనోహర్, నాగేంద్ర, అర్షద్‌అలి, అమ్ము, శ్రీనివాసులు, నరసింహులు, పార్టీ నేతలు ఇఫ్తికార్, రాజేష్, సురేష్, జెపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఏడాదిలో ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేసిన వైఎస్.జగన్
Tags; Two reservoirs will be built to address the problem of fresh water