రెండుగా విడిపోయిన లష్కర్ తొయిబా

Date:13/03/2018
ఇస్లామాబాద్  ముచ్చట్లు:
పాక్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించే లష్కరే తొయిబా రెండుగా విడిపోయింది. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న ముంబయి మారణహోమం సూత్రధారి హఫీజ్ సయీద్‌పై పాక్ ప్రభుత్వం నిషేధం విధించడంతోపాటు నిధులను నిలిపివేయడంతోనే లష్కరే తొయిబా రెండుగా చీలిపోయినట్టు సమాచారం. ఈ సంస్థ సహ-వ్యవస్థాపకుడు మౌలానా అమీర్ హంజా, జైషే మన్ ఖాఫా పేరిట వేరు కుంపటి పెట్టుకున్నాడు. హఫీజ్‌కు కుడి భుజంగా ఉన్న అమీర్ హంజా 2008 ముంబై ఉగ్రదాడి వెనుక కీలక భూమిక పోషించాడు. జమాతే ఉద్దవా, ఫలాహ్ ఇ ఇన్సానియత్ నుంచి ఆయనకు నిధులు అందుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. హఫీజ్ బ్యాంకు ఖాతాలను ఇటీవలే పాకిస్థాన్ స్తంభింపజేయడంతో ఉగ్రకార్యకలపాల నిర్వహణకు మరో సంస్థను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడులకు సైతం మౌలానా వ్యూహరచన చేస్తుంటాడు. తీవ్రవాద నిరోధక చట్టం 1997కు సవరణలు సూచిస్తూ పాక్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌కు పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఆమోదం తెలిపినట్టు గత ఫిబ్రవరి 9 న ఆ దేశ న్యాయశాఖ ప్రకటించింది. దీంతో దేశంలోని తీవ్రవాద సంస్థలు ముఖ్యంగా హఫీజ్ సయీద్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు పాక్ అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీచేసింది. జమాతే ఉద్దవా దాని అనుబంధ సంస్థల ఆస్తులను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ గత జనవరిలో జప్తు చేసింది.
Tags: Two split Lashkar Tea

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *