Natyam ad

రామసముద్రంలో నీటి కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

రామసముద్రం ముచ్చట్లు:

ఫారంపాండ్‌ నీటి కుంటలో ప్రమాదవశాత్తు కాలుజారిపడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని రాగిమాకులపల్లె పంచాయతీ సాన్నిప్పల్లెలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సాన్నిపల్లె గ్రామానికి చెందిన టి.నాగేష్‌కు కిషోర్‌(12), నందీష్‌ (10) ఇద్దరు కుమారులు కలరు. కిషోర్‌ దిన్నిపల్లె సమీపంలో ఉన్న మోడల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. నందీష్‌ సాన్నిపల్లె ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపధ్యంలో గ్రామ సమీపంలోని శంకర్‌కు చెందిన వ్యవసాయ భూమిలో తాత కృష్ణప్ప కూలీ పనులకు వెళ్లాడు. శనివారం తాత వద్దకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు ఫారంపాండ్‌ కుంటలో పడిపోయారు. విషయం తెలుసుకున్న తాత కేకలు పెట్టడంతో చుట్టుపక్క ఉన్న వారు కుంట వద్దకు చేరుకుని విద్యార్థులను వెలికితీసేందుకు ఇనుపకొక్కిలు కట్టి విద్యార్థులను బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించి కన్నీరుమున్నీరైయ్యారు. ఈ విషయమై పోలీసులు శవాలను పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags:Two students died after falling into a puddle in Ramasamudra

Post Midle

Leave A Reply

Your email address will not be published.