ఇద్దరు దొంగలు అరెస్టు-ఎస్పీ రఘవీరారెడ్డి
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల జిల్లా లో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన పలు దొంగతనం కేసుల పరిష్కారంలో ప్రతిభ కనబరచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ రఘవీరారెడ్డి అభినందించారు. జిల్లాలో దొంగ తనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసామని తెలిపారు వారి వద్ద నుంచి 12 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన వారిని పట్టుకోవడంలో ప్రతిభ చూపించిన పోలీసు సిబ్బందిని అభినందించారు. చెంగల్పట్టు నీలకంఠం కళ్యాణ చక్రవర్తి (46), చిక్కొండ కురువ అర్జున్ (33) లను అదుపులోకి తీసుకున్నారు.
Tags; Two thieves arrested-SP Raghaveera Reddy

