ఇద్దరు దొంగలు ఆరెస్టు
ప్రకాశం ముచ్చట్లు:
పగటిపూట ఇళ్ళల్లో చోరికి పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్టు చేసారు.. రాష్ట్రవ్యాప్తంగా పదిహేడు కేసుల్లో నిందితులుగా ఉన్న ఈ దొంగలను ప్రకాశంజిల్లా పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్టు చేసారు. చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రకాశంజిల్లా ఎస్పీ మాలికా గార్గ్ అభినందించారు. . చోరీ సొత్తు విలువ సుమారు ముప్పై లక్షల డెబ్బై రెండువేల రూపాయల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు. వినుకొండ మండలం పల్నాడుజిల్లా పెద్ద కంచర్ల గ్రామానికి చెందిన గుడిపాటి వీరాంజి చాలా కాలంనుండి దొంగతనాలు చేయుటకు అలవాటుపడ్డాడు. ప్రకాశంజిల్లాతో పాటు చిలకలూరిపేట, బొల్లాపల్లి మండలంలో గుడిపాటి వీరంజి పగటి పూట తిరిగి ఎక్కువుగా ఇంటి యజమానులు ఇంటికి తాళం వేసి, తాళాలని పక్కనే గుట్లలో గాని ప్రక్క పెట్టడం గాని, బీరువా తాళలను బీరువాల పైన దిండుల క్రింద పెట్టడం గమనించి దొంగతనములకు పాల్పడుతున్నారు. దొంగలించిన బంగారు వస్తువులను గోపు శ్రీనివాసరావుకు ఇచ్చి వాటిని అమ్మమని చెబుతారు. త్రిపురాంతకం సీఐ ఎం రాంబాబు, కురిచేడు ఎస్సై శివ నాగరాజులు కలసి ముమ్మర దర్యాప్తు చేసి నిందితులను వెంగాయపాలెం గ్రామ చెక్ పోస్ట్ కురిచేడు మండలం వద్ద అరెస్టు చేసారు. వీరి వద్దనుండి 640 గ్రాముల బంగారు నగలు, ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు.
Tags: Two thieves were arrested

