Natyam ad

రెండుఓట్లు ఫ్యాన్‌ గుర్తుకే వేయాలి 

పుంగనూరు ముచ్చట్లు:

మే 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు ప్రతి ఒక్కరు వేయాలని పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్లు  శివ , శరణ్‌ లు కోరారు. ఆదివారం పట్టణంలోని షిరిడిసాయినగర్‌, కోర్టురోడ్డు, దోబీకాలనీ ప్రాంతాలలో ఇంటింటా ప్రచారం చేశారు. అలాగే కౌన్సిలర్‌ అర్షద్‌అలీ, వైఎస్సార్‌ మజ్ధూర్‌ ఆర్టీసి అధ్యక్షుడు జయరామిరెడ్డి, మక్క కమిటి డైరెక్టర్‌ ఖాదర్‌లు కలసి నాగపాళెంలో ప్రచారం చేశారు. హైస్కూల్‌వీధిలో కౌన్సిలర్‌ పూలత్యాగరాజు, నానబాలవీధిలో సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్‌ నయీంతాజ్‌, మైనార్టీ సెల్‌ కార్యదర్శి ఇంతియాజ్‌ఖాన్‌, రహమత్‌నగర్‌లో పట్టణ మైనార్టీ సెల్‌ కార్యదర్శి మహబూబ్‌బాషా, తాటిమాకులపాళెంలో కౌన్సిలర్‌ నటరాజ ,  కొత్తపేటలో కౌన్సిలర్‌ మమత, వైఎస్సార్‌సీపీ నాయకుడు లక్ష్మణరాజు, ఎల్‌ఐసీ కాలనీలో కాపు సంఘ నాయకుడు ఎస్వీటి సోమశేఖర్‌, ఉబేదుల్లాకాంపౌండులో భారత్‌ టైలర్లు ఖాసీమ్‌, నరసింహులు, సూరి  ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు.  రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ మెజార్టీతో గెలిపించాలని , రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకోవాలని కోరారు. ఈ ప్రచారాలలో వెంకట్రమణాచారి,  నానబాలగణేష్‌,శ్రీనివాసులు,రెడ్డెప్ప, పిఎల్‌.శ్రీధర్‌, మహేంద్రరావు, ఆర్‌కె.రామకృష్ణ , గోపాలకృష్ణ,  తదితరులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags; Two votes should be cast for the fan symbol

Post Midle