Natyam ad

వైఎస్సార్‌సీపీకి రెండు ఓట్లు వేయాలి

పుంగనూరుముచ్చటుల:

ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ విజయంతో గెలిపించాలని పలువురు ప్రచారాలు చేశారు. పట్టణంలో జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు ఎస్టీఎఫ్‌ సాధిక్‌, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, మక్కాకమిటి డైరెక్టర్‌ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే హైస్కూల్‌వీధి, బ్రాహ్మణవీధిలో బ్రాహ్మణ సంఘ నాయకులు రామమూర్తి, డాక్టర్‌ రమణరావు, సుజాత, గిరి, ఫణిభాస్కర్‌, నారాయణ, అశ్వర్థ, కృష్ణమూర్తి , కౌన్సిలర్‌ త్యాగరాజు కలసి ప్రచారాలు చేసి , వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు.

Post Midle

Tags: Two votes should be cast for YSRCP

Post Midle