Natyam ad

రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయాలి

పుంగనూరు ముచ్చట్లు:

ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ విజయంతో గెలిపించాలని , ఈ మేరకు మోడల్‌ ఈవిఎంలు చూపుతూ అవగాహన కల్పించారు. పట్టణంలోని తూర్పువెహోగశాలలో వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీనాథరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, స్థానిక నేతలు ప్రభు, రమణ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మండలంలోని సింగిరిగుంట, ఆరడిగుంట గ్రామాల్లో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ ఆంజప్ప ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. అలాగే మండలంలోని భీమగానిపల్లె, కుమ్మరనత్తం పంచాయతీలో పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, సుబ్బన్న యాదవ్‌, తేజ ప్రచారాలు చేశారు. అలాగే బండ్లపల్లె గ్రామంలో బోయకొండ కమిటి చైర్మన్‌ నాగరాజారెడ్డి, సర్పంచ్‌ సునీత , మాజీ సర్పంచ్‌ సుబ్బిరెడ్డి ఆధ్వర్యంలో మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. కౌన్సిలర్‌ అర్షద్‌అలి నాగపాళెంలో ప్రచారం చేశారు. కౌన్సిలర్‌ మనోహర్‌, పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్లు శరణ్‌, శివ లు నక్కబండలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మటన్‌ వ్యాపారులు, దళిత నాయకులు అస్లాంమురాధి, రాజు లు కలసి అంబేద్కర్‌ సర్కిల్‌లో ర్యాలీ నిర్వహించారు. బలిజ సంఘ నాయకులు నానబాల గణేష్‌, మణి, త్యాగరాజు, రాయల జగదీష్‌, తుంగా మంజునాథ్‌ , ప్రభాకర్‌, నటరాజ, మణి , రవి , గోపి లు ప్రచారం చేశారు. అలాగే ఎంబిటి రోడ్డులో ముస్లింనాయకురాలు రహత్‌జాన్‌, ముబినా, షాతాజ్‌, అయిషా, జరీన్‌తాజ్‌లు ఇంటింటా ఈవిఎంలపై అవగాహన కల్పించారు.

Post Midle

 

Tags: Two votes should be marked by the fan

Post Midle