బోయకొండ భక్తుల కోసం రెండు వీల్‌చైర్లు
చౌడేపల్లె ముచ్చట్లు:
పుణ్యహొక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రెండు వీల్ చైర్‌లను మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తి, మంత్రి పెద్దిరెడ్డి పిఏ మునితుకారంలు అందజేశారు. మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళికు అంద జేసి ఆలయానికి వచ్చే యాత్రికులకు సౌకర్యంగా వినియోగించుకోవాలన్నారు. వీటితోపాటు వృధ్దులతోపాటు, వికలాంగులకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు రుక్మిణమ్మ, రెడ్డిప్రకాష్, వైస్ ఎంపీపీ నరసింహులు యాదవ్,సర్పంచ్ హైమావతి, కోఆప్షన్‌మెంబరు సాధిక్ భాషా, డిసిసిబి డైరక్టర్‌రమేష్‌బాబు, మాజీ డైరక్టర్ శ్రీనివాసులరెడ్డి, రంగనాథ్, చిన్నా, నాగరాజ తదితరులున్నారు.

Tags: Two wheelchairs for Boyakonda devotees
