Natyam ad

పుంగనూరులో ద్విచక్రవాహనంలో మంటలు – యువకుడు సజీవదహనం

పుంగనూరు ముచ్చట్లు:

ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనంలో మంటలు రావడంతో వాహనదారుడు సజీవదహనమైన సంఘటన శనివారం సాయంత్రం పట్టణ సమీపంలోని అరబిక్‌ కళాశాల వద్ద జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పలమనేరు పట్టణంలోని ముత్తాచారిపాళ్యెంలో నివాసం ఉన్న అంజాద్‌బాషా కుమారుడు ఆదిల్‌బాషా (19) ద్విచక్రవాహనంలో అరబిక్‌ కళాశాల సమీపంలోనికి రాగా ఇచర్‌లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనం క్రిందపడి మంటలురావడంతో వాహనాన్ని నడుపుతున్న యువకుడు ఆదిల్‌బాషా అక్కడిక్కడే మంటల్లో కాలి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతుడు పలమనేరు నుంచి పుంగనూరుకు వస్తుండగా ప్రమాదం జరిగిందా..?లేక మదనపల్లెలో జరుగుతున్న ఇస్తిమా చూసుకుని పలమనేరుకు వెళ్తుండగా జరిగిందా..? లేక వేరే కోణం ఏమైనా ఉందా అన్న రీతిలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Post Midle

Tags; Two-wheeler catches fire in Punganur – Youth burnt alive

Post Midle