రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి.

తిరుమల ముచ్చట్లు:

తుఫాను వలన ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రెండు ఘాట్ రోడ్లలో పొగ మంచు దట్టంగా ఉన్నది. దీనివలన వాహన రాకపోకులకు అక్కడక్కడ అంతరాయం కలుగుతోంది. అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు తమ ముందున్న వాహనాలు సరిగా కనపడక ఇబ్బందులకు గురి అవుతున్నారు. తద్వారా వాహనాలు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గి సాధారణ స్థితి వచ్చేంతవరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుండి సాయంత్రం 8 వరకు మాత్రమే అనుమతించబడును. కనుక భక్తులు ఈ మార్పును గమనించి టిటిడి కి సహకరించవలసిందిగా కోరడమైనది. జె ఈ ఓ  వీరబ్రహ్మం ఆధ్వర్యం లో ఘాట్ రోడ్ లలో తనికీలు.వర్షం కారణంగా రెండు ఘాట్ రోడ్ లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వుండేందుకు గాను అధికారులతో కలిసి
జె ఈ ఓ  వీరబ్రహ్మం ఘాట్ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్, ఫారెస్ట్, సెక్యూరిటీ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఆయన వెంట ఎస్ ఈ జగదీశ్వర రెడ్డి, విజివో నంద కిషోర్, ఫారెస్ట్ అధికారి   శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

 

Post Midle

Tags:Two-wheelers allowed on both ghat roads.

Post Midle