బస్సు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి
కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. నడుచుకుంటూ వెళ్తున్న లచ్చవ్వ, రాజవ్వ పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీ దగ్గర బుధవారం తెల్లవారు జామున వరంగల్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసి బస్సు నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను డీ కొట్టి వెళ్లిపోయింది.మానకొండూర్ కి చెందిన లచ్చవ్వ(37), రాజవ్వ(40) ఉదయం పూట పనుల నిమిత్తం ఇంటి నుండి నడుచుకుంటూ వెళుతుండగా ఆర్టీసి బస్సు డీ కొట్టగా అక్కడిక్కడే మృతి చెందారు. మృతదేహాలను చూచిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృత దేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ కి తరలించారు. ఈ ఘటనతో మానకొండూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Tags: Two women died after being hit by a bus

