రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి

కరీంనగర్ ముచ్చట్లు:

 


కరీంనగర్ నగరంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే  మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సిరిమల్ల జ్యోతి (45) కరీంనగర్జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్నది. ఈమె పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రేగడి మద్దికుంట జెడ్పీహెచ్ఎస్లో ప్రధానోపాధ్యయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన సౌజన్య సిరిమల్ల జ్యోతికి పూర్వ విద్యార్థిని. సౌజన్య పోటీ పరీక్షలకు సన్నద్దమవడానికి జ్యోతి సహాయం తీసుకుంటున్నది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వారిద్దరూ స్కూటీపై ఎన్టీఆర్ చౌరస్తా నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ వైపు వెళ్తుండగా వెనుక నుంచి ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: Two women died in a road accident

Post Midle
Post Midle