రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
-మరోకరికి తీవ్ర గాయాలు
శ్రీ సత్యసాయి ముచ్చట్లు:

శ్రీ సత్యసాయి జిల్లా రోద్దం మండలం చిన్న కోడి పల్లకి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.కర్ణాటకలోని పావగడ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం డీకొంది. దాంతో, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులలో ఇద్దరు అక్కడీకి అక్కడే మృతి చెందారు. మరోకరి పరిస్థితీ విషమం వుంది. ముగ్గురు యువకులది రొద్దం మండలం చిన్న కోడిపల్లి గ్రామానికి చెందిన జస్వంత్, రాము, ఈశ్వర్ లు గుర్తించారు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న ఈశ్వర్ ని ఆసుపత్రికి తరలించారు.
Tags: Two youths died in a road accident
