పుంగనూరులో తుఫాన్ కాల్ సెంటర్ ప్రారంభం
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటిలో మాండూస్ తుఫాన్ కాల్ సెంటర్‌ను గురువారం ప్రారంభించినట్లు కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు 12 వరకు కాల్ సెంటర్ నెంబరు 08581-252166 ఫోన్‌కు ప్రజలు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఎలాంటి నష్టము, సహాయము కావాల్సిన వారు కాల్‌సెంటర్‌ను సంప్రదించాలన్నారు. ఈ మేరకు పాలకవర్గ సభ్యులకు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లుకు సమాచారం అందించి అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. తుఫాన్ ద్వారా ఎలాంటి నష్టము జరగకుండ చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Tags; Typhoon Call Center launched in Punganur
