తీవ్ర వాయు గండంగా మారిన టిట్లీ

Tytley turned into a severe windstorm

Tytley turned into a severe windstorm

 Date:09/10/2018
విశాఖపట్టణం  ముచ్చట్లు:
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తూర్పుమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరింత బలపడి బుధవారం నాటికి తుఫానుగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో అక్టోబరు 10, 11 తేదీల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాలోని దక్షిణ కోస్తా జిల్లాలో పలుచోట్ల రెండు రోజులపాటు కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇక ఉత్తరాంధ్రలోనూ రెండు రోజులపాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొద్ది చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నేడు తీరం వెంబడి గంటకు 65- 75 కిలోమీటర్ల వేగంతోనూ, బుధవారం గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలియజేసింది. దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కళింగపట్నానికి 690 కిలోమీటర్లు, గోపాలపూర్‌కు 720 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. 24 గంటల్లో వాయుగుండం బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని, 48 గంటల్లో అదికాస్తా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది.
ఈ రెండు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా రూపుదాల్చింది. దీనికి లుబన్ అని పేరు పెట్టారు. ఇది పశ్చిమ వాయవ్యంలో ఒమన్ తీరం దిశగా పయనిస్తోంది. రాగల ఐదు రోజుల్లో ఇది ఒమన్ పరిసర ప్రాంతాల్లో తీరదాటే సూచనలు ఉన్నాయి.
Tags:Tytley turned into a severe windstorm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *