Ubdevars with devotional thought

భక్తి శ్రద్దలతో ఉబ్బదేవర్లు

Date:19/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని వినాయక రజకసేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉబ్బదేవర్ల పండుగను వైభవంగా భక్తిశ్రద్దలతో నిర్వహించారు. సంఘ ప్రతినిధులు శ్రీనివాసులు , మురుగేష్‌బాబు ఆధ్వర్యంలో అమ్మవారిని పట్టణ పురవీధులలో మేళతాళాలతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వర్షాలు సకాలంలో కురవాలని , పంటలు పండి కుల వృత్తుల వారు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారికి వెహోక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి చలిపిండి దీపాలు వెలిగించి, జంతుబలులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు డ్రైవర్‌ రెడ్డెప్ప, గంగాధర్‌, రమేష్‌, ఎస్‌.శ్రీనివాసులు, వేణుగోపాల్‌, హేమంత్‌కుమార్‌, వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలియో మహమ్మారిని తరిమికొట్టండి

Tags: Ubdevars with devotional thought

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *