పుంగనూరులో ఉధ్యమంలా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్నే మా భవిష్యత్తు , మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై ఉధ్యమంలా నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లడంతో ప్రజల్లో , పార్టీ నాయకుల్లో నూతన ఉత్తేజం ప్రారంభమైంది. ఆదివారం మున్సిపాలిటి పరిధిలో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, జిల్లా వక్ప్ బోర్డు చైర్మన్ అమ్ము, రాయలసీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కెఎస్‌ఏ.ఇఫ్తికార్ అలీఅహమ్మద్ ఆధ్వర్యంలో 31వ వార్డులలోను కౌన్సిలర్లు, గృహసారధులు, వలంటీర్లు ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్నారు. అలాగే మండలంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి,ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి ఆధ్వర్యంలో చండ్రమాకులపల్లె, ఈడిగపల్లె, మంగళం , వనమలదిన్నె, ఆరడిగుంట గ్రామాల్లో నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రశ్నలకు జవాబులు సేకరించడం , స్టిక్కర్లు అంటించడం, ప్రజలతో మమేకం కావడం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఒక్కసారిగా పట్టణంలోను, పల్లెలోను పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, రాజశేఖర్‌రెడ్డి, రాజేష్, కొండవీటి నరేష్, లక్ష్మణ్‌రాజు, శ్రీనివాసులు,బాలు తదితరులు పాల్గొన్నారు.

Tags; Udhyamanla Jagananne is our future program in Punganur
