Natyam ad

మార్చి 22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

– మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

– మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

– మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

 

Post Midle

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది.ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

 

మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు :

తిరుమల శ్రీ‌వారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది.ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

 

Tags: Ugadi Asthanam at Tirumala Srivari Temple on March 22

Post Midle