Ugadi can be celebrated if the man is alive

మనిషి బ్రతికి ఉంటే ఉగాధి పండుగ చేసుకోవచ్చు

– పట్టణంలో తిరగరాదు
– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:24/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

మానవాళి మనుగడకు విఘాతం కలిగిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు మున్సిపల్‌ అధికారులు, పోలీస్‌, రెవెన్యూ, వైద్యశాఖ కృషి చేస్తుంటే కొంత మంది పనిలేకుండ తిరగడంపై కమిషనర్‌ కెఎల్‌.వర్మ మండిపడ్డారు. పట్టణంలో ఆయన తన సిబ్బందితో కలసి స్వయంగా వాహనదారులను నియంత్రించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ అధికారులు, సిబ్బందితో కలసి ప్లకార్డులు పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కెఎల్‌.వర్మ మాట్లాడుతూ ప్రజల్లో బాధ్యతాయుతమైన చైతన్యం రావాలన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం అధికారులు ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తుంటే కొంత మంది కావాలని రోడ్లపైకి రావడం బాధకరమన్నారు. అడిగిన ప్రతి వారు ఆసుపత్రికని, పండుగ సరుకుకని కుంటిసాకులు చెప్పడంపై మండిపడ్డారు. మనుషులు బ్రతికుంటే ఎన్ని ఉగాధి పండుగలైన చేసుకోవచ్చునని తెలిపారు. ఉగాధికి బట్టలు పెట్టేందుకు మీరు వెళ్లితే వచ్చే ఏడాదికి మీకు బట్టలు పెట్టాల్సిన పరిస్థితి రాకుండ ప్రజలు గమనించాలని సూచించారు. బాధ్యతతో ప్రభుత్వాదేశాల అములుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు , అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, ఆర్‌వో రామకృష్ణ, ఆర్‌ఐ తిరుమలరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సప్ధర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

 

పట్టణంలో 144 సెక్షన్‌ అమలు

Tags: Ugadi can be celebrated if the man is alive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *