ఏప్రిల్ 9న శ్రీ పద్మావతి అమ్మవారి  ఆలయంలో ఉగాది వేడుకలు

– పుష్ప పల్లకిలో అమ్మవారు దర్శనం

 

తిరుపతి ముచ్చట్లు:

 

సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.  సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.  ఈ సందర్భంగా విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం, కుంకుమార్చన, ఊంజ‌ల్‌ సేవను టీటీడీ రద్దు చేసింది.

 

Tags: Ugadi celebrations at Sri Padmavati Ammavari Temple on 9th April

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *