Natyam ad

ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్‌ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేశారు.తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారి ఉత్సవరులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు.సాయంత్రం 6 గంటల నుంచి పుష్పపల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.

 

Post Midle

Tags; Ugadi court, almanac listening

Post Midle