పుంగనూరులో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టండి

uild a Tribunal party in Punganaru

– అనీషారెడ్డి

Date:24/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టంకట్టి, పూర్వ వైభవం తీసుకురావాలని అసెంబ్లి అభ్యర్థి అనీషారెడ్డి పిలుపునిచ్చారు. పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ తమ్మరాజుపల్లెగ్రామంలో ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత ఎంపీ రామక్రిష్ణారెడ్డి ఆశయలను సాధించేందుకు పుంగనూరు ప్రజలకు అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో పార్టీని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత పది సంవత్సరాలుగా పార్టీకి దూరమైన ప్రజలు, పార్టీ నేతలు తమకు ఎంతగానో సహకరిస్తూ , తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయడం మరువలేనిదన్నారు. రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్‌ గుర్తుకు వేసి , ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను , ఎంపీ అభ్యర్థిగా డికె.సత్యప్రభను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు మహిళనాయకురాలు రత్నమ్మ, రాధాక్రిష్ణమనాయుడు, మదుసూదన్‌నాయుడు, శ్రీనివాసులునాయుడు, విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

క్షయ వ్యాధి నివరాణపై ర్యాలీ

Tags: uild a Tribunal party in Punganaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *