Natyam ad

ఉలగనాయగన్ కమల్ హాసన్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌, మోస్ట్

ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #KH237కు దర్శకులుగా మాస్టర్స్ అన్బరివ్

 

హైద్రాబాద్ ముచ్చట్లు:

Post Midle

ఉలగనాయగన్ కమల్ హాసన్, ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో  మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్ స్టర్ యాక్షనర్ ‘థగ్ లైఫ్’ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.మరోవైపు కమల్ హాసన్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #KH237 కు సంబధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. #KH237కు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు అన్బరివ్(అన్బుమణి, అరివుమణి) దర్శకత్వం వహిస్తున్నారు.ఈ విషయాన్ని కమల్ హాసన్ తెలియజేస్తూ.. ‘ఇద్దరు ప్రతిభావంతులు, వారి కొత్త అవతార్‌లో #KH237 దర్శకులుగా చేరడం గర్వంగా ఉంది. మాస్టర్స్ అన్బరివ్… రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌కి తిరిగి స్వాగతం’ అని ట్వీట్ చేశారు. కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్  తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్  బ్యానర్ పై  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు మేకర్స్.

 

Tags: Ulaganayagan Kamal Haasan, Raj Kamal Films International, Most

Post Midle